తెలంగాణ వేర్పాటే పరిష్కారమా??.... పరిష్కారం కాదు, ప్రత్యామ్నాయం మాత్రమే. మరి ఎక్కడుంది ఈ సమస్యకు పరిష్కారం ??? భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినప్పుడు శ్రీ నెహ్రూ ఉధ్ఘాటించిన నిజాల్లో వుంది. ప్రాంతీయ అసంతృప్తులు పెళ్ళుబుకుతాయేమో అన్న SRC అనుమానాల్లో వుంది. ఆంధ్ర ఫ్రధేశ్ అవతరణకి ముందు చేసిన పెద్ద మనుషుల ఒప్పందంలో వుంది. జై తెలంగాణ ఉద్యమం ఎగిసిపడ్డప్పుడు ఇందిరమ్మ చేసిన ఆరు సూత్రాల ప్రణాళికలో వుంది. ప్రాంతీయులకు ఉద్యోగాలివ్వాలని నందమూరి జారీ చేసిన 610 జి.వొ. లో వుంది.
"ప్రాజెక్టులన్నీ పడ్వవడేను, ఎస్సార్సి ఎన్నడో ఎండిపాయెను,
మట్టిల కలిసే పెద్దోల్ల సౌద, ఆరొందలపది ఆవిరయ్యేను,
మా ఆశలన్నీ తేలిపాయెను, ఏమున్నదింక మా బతుకు తేల."
ఇన్ని పరిష్కారాలు ఇచ్చినా ఏఒక్కటీ అమలుకు నోచుకోలేదెందుకు ??? 50 ఏళ్ళుగ తెలంగాణ ఇంకా ఎందుకు వెనకబడివుంది? తమ వనరుల కోసం ఇంకా ఎందుకు పోరాడుతుంది? ఇన్ని పరిష్కారాలలో ఏఒక్కటి అమలు జరిగినా నేడు అన్నదమ్ముల మధ్య అగ్గి రాజుకునేదా ??? దేశంలోని ప్రతీ సమస్యపై ఔన్నత్యాన్ని చూపే తెలుగోడికి, తోటి తెలంగాణ గోడు పై శీతకన్నేయడం శోచనీయం.
మొదలు పెట్టిన ఏఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేసివుంటే నేడు నీళ్ళ కోసం మోకరిల్లె వారమా? చేస్తామని చెప్పిన అభివృద్ధిలో వీసమంతైనా జరిగివుంటె నేడు వెనకబడి వున్నామని అర్ధించే వాల్లమా? ప్రాంతీయులకు ఉద్యోగాలివ్వడంలొ చొరవ చూపించి వుంటే పొట్టచేత పట్టుకొని అరబ్ దేశాలాకు వలసలుండేవా? మరి నేడు ప్రాంతీయ అసమానతలు పొడచూపుతున్నాయంటే ఎవరిది తప్పు... ఆదుకోండని అలమటిస్తున్న ప్రజలదా?? లేక చెవిన నీరు పోసుకున్న పాలకులదా?? 50 ఏళ్ళుగా చేస్తున్న ప్రభుత్వ విధానాలదా? పక్షపాత బుద్దులతొ తెలంగాణ తమ్ముడికే అన్యాయం చేస్తున్న నాయకులదా?? దోశం ప్రభుత్వాలదైనప్పుడు, మా కష్టాలెరిగిన నిశ్పక్షపాత పరిపాలన కావాలని కోరుకోవడం నేరమా?? ఇది నేరం అయితే.. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన మహానుభావుల త్యాగాలు ప్రశ్నార్ధకమే !!!!
"బీడువారిన భూమినిడిసి, బర్ల గొర్లనమ్ముకొని,
పొట్ట చేతపట్టుకుని, సంకల మూటెత్తుకోని,
పిల్లజల్లనొదిలేసి, పుట్టినూరునొదులుకుని,
గుండెల్ల ఆశ నింపుకొని, దుబాయికేశి పైనమయ్యి,
నూనెబాయి కావలున్న, కూలినాలి చేసుకున్న,
దినారెమో కూడదాయె, బానిస బతుకీడ్సుడాయె,
అప్పులింక కూడ్పపోతి, ఈడనే ఇరికిపోతి."
హైదరాబాద్ రాజధాని కావడంతో అన్ని ప్రాంతాల వారు వలసలొచ్చి జీవనోపాధిని వెతుక్కుంటున్నారు. వ్యాపారాలు చేసుకుంటున్నారు. రాష్ట్రం నుండే కాకుండా దేశం నలుమూలల నుండొచ్చిన ప్రజలు హైదరాబాద్ లోనే తమ సొంతూరిని చూసుకుంటున్నారు. ప్రత్యేక రాష్ట్రం అడిగినంత మాత్రాన వీరందరిని గెంటేస్తారని అర్ధమేనా? ఇప్పటికీ మద్రాసులో ఉంటూ ఉద్యోగ, వ్యాపారాల్లో రానించిన తెలుగు వారు లెక్కకు మిక్కిలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డాక వాళ్ళందరిని పొమ్మనలేదు కదా!! సీమాంతరాలు దాటెల్లి వున్నత స్తానాలు చేరుకున్న ప్రవాసాంధ్రులు ఎందరో. వీరంతా స్థానికేతరులయినా కీలక పదవులు పొందలేదా !! ఒక తెలుగువాడిగా "జాగో - భాగో" నినాదాలని ఖండిస్తున్నాను. ఇలాంటివి తొందరపాటు వాఖ్యలే తప్ప తోటి తెలుగు వారిని తరిమివేయాలన్న దురాలోచన కానే కాదు. రాష్ట్ర విభజన, పరిపాలనలోనే తప్ప మనుషుల మధ్య కాదు. ప్రత్యేక రాష్ట్రం ఆకలి కడుపుకు అన్నం పెట్టడం కోసమే తప్ప సాటి తెలుగోడి నోటి ముందు కూడు దూరం చెయ్యడంకోసం కాదు. తెలంగాణ వేర్పాటు, ఎండిపోయిన నేలమీద నీటి చుక్కలేయాలనే తప్ప ఈ నేల మాది మాత్రమే అన్న దురహంకారం కాదు. ఏప్రాంత వాసులైనా, ఏమూల నుండి వొచ్చినా, హైదరాబాద్ అక్కున చేర్చుకుంటుందే కానీ, కాదు పొమ్మని దూరం చేసుకోదు. తెలంగాణ వేరుపడితే వలసొచ్చిన వారికి విలువ వుండదేమో అన్న అపోహలు వీడండి.
ఇక కొందరు వేర్పాటు వాదుల రెచ్చగొట్టే ఉపన్యాసాలతొనే నేడు తెలంగాణ ప్రజలు వీధుల్లోకి వొచ్చారని భావిస్తే అది సమస్య కి ఒక కోణం మాత్రమే. రాజకీయ ప్రయోజనాలకోసమే అయితే కార్యకర్తలే ముందుంటారు తప్ప, బలి దానాలిచ్చే విధ్యార్ధులు కాదు. ఆత్మార్పణ చేసుకున్న 40 మంది, తెలంగాణ కోసం ప్రాణాలర్పించారే తప్ప పార్టీల కోసం కాదు. 50 ఏళ్ళ క్రితమే ఈ ఉద్యమం ప్రజల నుండి పుట్టుకొచ్చింది. ప్రజాగ్రహానికి ప్రధాన మంత్రులే కదిలి వొచ్చారు. నాటి నుండి నేటి వరకు ఇది ప్రజా ఉద్యమమే కాని రాజకీయ నాటకం కాదు. ఈ సమస్యని ప్రతీ పార్టీ తమ రాజకీయ ప్రయోజనాలకోసం ఉపయొంగించుకుందే కానీ, ఉపశమనం చూపలేక పోయింది. ఇంతకముందు తెలంగాణ ఉద్యమాన్ని అనిచివేసిన అదే నాయకులు, నేడు తమ స్వార్ధ రాజకీయాలకు పావుగా వాడుకుంటున్నారు. పదవుల కోసం కొందరయితే, అధికారం కోసం మరికొందరు. ఎన్నికల కోసం కొందరయితే, సామాజిక అవసరాల కోసం ఇంకొందరు. నేడు సమైక్యాంధ్ర కోసం పొరాడుతున్న వీరే... నాడు ఓట్ల కోసం తెలంగాణ జై అన్నారు. సభలు పెట్టి తెలంగాణకు సై అన్నారు. ఎన్నికలు ముగిసాక జాంతా నై అంటున్నారు. అధికారం వొచ్చాక ఓడ మల్లన్నను బోడ మల్లన్నను చేసారు. నాడు వేదికలెక్కి తెలంగాణ కోసం ఉపన్యాసాలతొ ఊదరగొట్టినవాల్లె నేడు సమైక్య రాగంతొ రోడ్లెక్కారు. శ్రుతితప్పుతున్న ఈ రాగం వ్యాపార సామ్రాజ్యాలు కూలిపొతాయన్న భయంతొ కొందరు స్రుష్టించినదన్న వాదన కొట్టి పారేయలేని పార్శ్వం.
"కళ్ళంల రాశి కంటికానక,
జేబుల కాసు చెజారిపోగ,
అంగట్ల సరుకు ఇంట్లకు రాక,
కురాడు గంజి ఇంకిపోగ,
అప్పులొల్లు ఇక్కట్లు పెట్టంగ,
నేసిన నూలె గొంతు కోయగ.
దున్నిన నేలల్నే దహనం చెస్తిరి."
ఆకలి కడుపుకి వేదాంతం రుచించదు. పట్టెడన్నం పెట్టకుండా "కలిసుంటే కలదు సుఖమని" పాఠాలు వల్లె వేస్తారేం?? కలిసుండడం తెలుగు వాళ్ళందరికీ శ్రేయస్కరం అయినప్పుడు తోటి తెలుగువాడు కరువు తో ఆత్మహత్యలకు పూనుకుంటుంటే సాయానికి చెయ్యియ్యరేం? ఈ అన్యాయాన్ని గొంతెత్తి ప్రశ్నించరేం?? కష్టాన్ని పంచుకుంటాం అనరేం? ఓఅన్నగా మా సమస్యలని తీరుస్తాం అని భరోసా ఇవ్వరేం? 50 ఎళ్ళుగా కలిసుండడంలో రాని సుఖం, ఇంకెప్పుటికొస్తుంది?? ఇంత జరుగుతున్నా, తెలంగాణ సమస్యల పై ఏ ఒక్కరు స్పందించరేం?? ఆమోదయోగ్యమైన ఏ ఒక్క పరిష్కారం కూడా అమలుకు నోచుకోనప్పుడు, ప్రత్యామ్నాయం కాక మరేదీ మార్గం.
"ఉమ్మడిగుంటే సుఖమున్నదనీ, అన్నగ కష్టం తీరుస్తనంటివి,
ఆశగ చూస్తీ ఆకలికి పిలిస్తి, ఏమాయె అన్నా చెయ్యియ్యవెమీ,
ఒక్క తల్లికి ముగ్గురు బిడ్డలం, తమ్మున్ని ఇట్లా గాలికొదిలితివి,
ఏడంగపుట్టే ఈ సవితి ప్రేమ, ఇదేమి న్యాయం ఇదేమి ధర్మం."
వేరుపడితే మనుగడెలా అని ప్రశ్నించే వారికి డెసెంబర్ చివరి వారం వరంగల్ లో జరిగే మెధావుల సదస్సే సమాధానం.ఇది ఆరంభం మాత్రమే. నిపుణుల మార్గదర్శకంలొ ఇంకెన్నొ సమావేశలు రానున్నాయి. ఇవి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది బాటలో నడిపించడానికి ఏర్పాటు చేస్తున్న తురుపుముక్కల సమావేశాలు. సుభిక్ష తెలంగాణ కోసం ప్రణాళికలు రూపుదిద్దుకునేదిక్కడే. ఆకలి కడుపుకు అన్నం పెట్టే అలొచనలు అంకురించేదిక్కడే. ఆత్మహత్యలు మాని హలమే బలమని, అప్పుల బాధలు మరిచి నేత మగ్గాలే పండగ ముగ్గులని నమ్మేరోజులు మన ముందేవున్నాయి.
Thursday, December 17, 2009
Subscribe to:
Post Comments (Atom)

Nice one dude. Hope Dreams come true.
ReplyDeleteRama Krishna
Nice ra, I appreciate this
ReplyDeletegood one...100% right...Kadupu maadi ikkada telangana prajalu akali kekey tho darimdram nundi vimukthi kosam maa Telangana maku kaavali antey ! Veellu vollu Balsi donga thanam ga telangana lo kuda pettina asthula kosam ..malli maa shrama dochukovadaniki samaikyandra antunnaru ee donga andhra doralu!!
ReplyDeleteNice one dude..really I appeciate your dedicataion and work towords educating people who don't know about the "fight for food" of telanagana people.
ReplyDeleteReally I am using Your article for educating people in rural areas..
Hi Mr. Hari,
ReplyDeleteI do appreciate your words.
But there are certain aspects that need to be considered before everyone accepts a separate Telangana State.
1. Issues regarding sharing of water resources like Godavari. Ppl are aware of the problems they face because of the river water sharing with neighbouring states.
2.Right from formation of Andhra, Hyderabad has been the point of focus for development and if you see the spread of Industries or Premier Educational Institutes , they are concentrated in and around hyderabad.If the state gets separated, the educational and employment opportunities for the rest of andhra will be very less.
I feel that if these can be addressed properly, every thng would be fine.
chimpavu
ReplyDeleteit shows ur dedication
Wonderful Hari. India is prod of you
ReplyDelete