ఈ సంవత్సరం మార్చిలో శ్రీక్రిష్ణ కమిటీ ఏర్పడినప్పటి నుండి తెలంగాణాకు శాంతియుత పరిష్కారం దొరుకుతుందని తెలంగాణా వాదులంతా ఎదురుచూస్తున్నారు. ఈ కమిటీకి చట్టబద్దత లేనప్పటికీ, ఒక Educated Solution వస్తుందని ఆశపడుతున్నారు. విధివిధానాలలో తెలంగాణ అనుకూలంగా లేదా వ్యతిరేకంగా సూచించాలని లేకున్నా, తెలంగాణాకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేస్తారన్న నమ్మకంతో గత పది నెలలుగా వేచిచూస్తున్నారు. తెలంగాణ అంతిమ సమరానికి సిద్ధమవుతున్న తరుణంలో, ప్రత్యేక తెలంగాణ భవితవ్యం తేలుస్తుందనుకుంటున్న శ్రీక్రిష్ణ కమిటీ తమ రెపోర్టును సమర్పిస్తారన్న సమయంలో, గత నేల రోజులుగా జరుగుతున్న పరిణామాలు కొంచం కలవరపరిచేలా కనిపిస్తున్నాయి. రాష్త్రానికి కొత్త CM, విద్యార్ధుల పై మరిన్ని కేసులు, అదనపు బలగాల మొహరింపు, శాంతంగా వుండాలని SKC విగ్న్యప్తి. ఇవన్ని అగ్నికి ఆజ్యం పోసేవే తప్ప ఆర్పేవి కావు. ఎదురుదెబ్బలకు రాటుతేలి, రెట్టింపు వేగంతో ముందుకు ఉరుకుతున్నం కాని వెన్నుచూపడం లేదు.
ఆవినీతి ‘రాజ’కుమారుడు జగన్ ను నియంత్రించాలని కాంగ్రేస్ అధిష్టానం ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రినే మార్చేసింది. హైదరాబాదులో పుట్టి చిత్తూరుకు ప్రాతినిధ్యం వహిస్తున్న కిరణ్ కుమార్ కు పగ్గాలు అప్పచెప్పడంలోని ఆంతర్యం ఏమిటి? గత సంవత్సరకాలంగా తెలంగాణా ఉద్యమంలో కీలకపాత్ర వహిస్తున్న జానారెడ్డి కి మంత్రి పదవినివ్వడంలో మర్మం ఏమిటి? ఊపముఖ్యమంత్రి పదవి ఆరొవేలంటూ, వున్నా వూడినా ఒకటేనంటూ ఇన్నాళ్ళు మాయమాటలు చెప్పి ఇప్పుడు తెలంగాణాకు ఊపమిఖ్యమంత్రి పదవి ఇస్తాననడం, పదవులే పరమావధిగా పరుగులుతీస్తున్న వారిని లోంగదీసుకోవడానికేనా? దేశ హోం మంత్రి స్వయంగా చేసిన ప్రకటనను తుంగలోతొక్కి విధ్యార్ధులపై కేసులను ఉపసమ్హరించకుండా, మరిన్ని కేసులు బనాయించి జైళ్ళో ఉంచాల్సిన అవసరం ఏమిటి? సమైఖ్యవాదులంతా కూడబలుక్కొని శ్రీక్రిష్ణ కమిటీ రిపోర్టుకు కట్టుబడి ఉంటాం అంటున్నారు.!! కమిటీ మాత్రం పరిష్కారాలు కాదు సూచనలు మాత్రమే చేస్తాం అంటున్నారు. ఆ సూచనలు ఖచ్చితంగా ఒక వైపు వారిని అసంతౄప్తిని కలుగచేస్తాయని వారే అంటున్నారు. నిర్ణయమేదైనా శాంతియుంతంగా వుండాలని కోరుతున్నారు. మారొవైపు శాంతిభధ్రతల కోసమని పోలీసు శాఖ ఒక్క తెలంగాణాలోనే అదనపు బలగాలను మొహరిస్తోంది.
ఈ పరిణామాలన్ని చూస్తుంటే తెలంగాణాకు వ్యతిరేకంగా ఏదో జరుగుతోందనిపిస్తుంది. దుష్టశక్తులన్ని మళ్ళీ ఏకం అవుతున్నట్టు కనిపిస్తోంది. అయినా ఇలాంటి తాటాకు చప్పుళ్ళకు అదిరే కుందేళ్ళు కాదు తెలంగాణా బిడ్డలు. కుయుక్తులని కూకటివేళ్ళతో పెకిలించే కదనవీరులు తెలంగాణా పౌరులు. అరచేతిని అడ్డంగాపెట్టి సూర్యున్ని ఆపలేరు. అరెస్టులు చేసి ఉద్యమకారుల్ని నిలువరించలేరు. లాబీయింగ్ చేసి మా ఆత్మస్తైర్యాన్ని అంతమొందించలేరు. రిపోర్టులను తారుమారు చేసి మా గుండెనిబ్బరాన్ని చీమంతైనా తగ్గించలేరు. ఇదే అంతిమ సమరం. సర్వశక్తులూ ఒడ్డుదాం. ఉద్యమాన్ని ఉద్రుతం చేద్దాం. సీమాంధ్ర మోసాలకు చరమగీతం పాడుదాం. అవకాశవాద రాజకీయాలను అంతంచేద్దాం. ప్రత్యేక తెలంగాణాను సాధించుకుందాం. అప్పటి వరకు అలుపెరుగని పోరాటం చేద్దాం.
జై తెలంగాణ… జై జై తెలంగాణా
Saturday, December 18, 2010
Subscribe to:
Post Comments (Atom)

Mama FOnts work avvadam ledhu .. install cheyala telugu fonts emaina ....
ReplyDeleteyeah ra.. it needs telugu font. Try one from eenadu.net.
ReplyDeleteబాగా రాసావు హరి.
ReplyDeleteనాకు పెద్దగా రాజకీయ అవగాహన లేదు, అందుకని ఇందులోని వివరాల మీద నేను వాదించ/ ఏకీభవించ లేను. ఐతే ఈ ఉద్యమం వల్ల చోటు చేసుకున్న పరిణామాలలో OU విద్యార్ధులపై జరిగిన దాడులూ, నాసనమైన వారి జీవితాలూ చూస్తే చాలా బాధగా ఉంటుంది. రాజకీయాలూ, విద్యార్ధులూ (ప్రముఖంగా విస్వ విద్యాలయాలు) ఎప్పుడు కలిసినా ఇదే పరిణామం.
శ్రీజో
శ్రీ,
ReplyDeleteతెలంగాణ ఒక రాజకీయ ఆంశం. విద్యార్ధుల దాక రావల్సిన విషయం కాదు. కాని ప్రస్థుతం వారే ఉద్యమం నడిపిస్తున్నరు. సంవత్సరం క్రితం వరకు మనకెందుకు రాజకీయలు అనుక్కున్న నెను, వారితొ మాట్లాడాక "నెను సైతం" అనవల్సి వొచ్చింది. అవును.. విద్యార్ధుల జీవితాలు నాషనం అవుతున్నయి. కాని తప్పదు. సంవత్సర కాలంగా విద్యార్ధులు కాలేజిలు వొదిలి రోడ్ల ఎక్కి ఆందొళనలు చెస్తున్నారంటె ఈ విషయ తీవ్రత అర్ధం చేసుకోవచ్చు.
- హరి